ఆదిలాబాద్ జిల్లాలో 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఆదిలాబాద్ జిల్లాలో 290 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా బోరజ్ చెక్ పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న 290  క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు.  పక్కా సమాచారంతో డీఏస్పీ జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ సాయినాథ్ ఆధ్వర్యంలో  బోరజ్ చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీలు చేయగా, లారీలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు.

హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్ లోని బాలఘట్ కు అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ బియ్యం విలువ రూ. సుమారు 15 లక్షల వరకు ఉంటుంaదని పేర్కొన్నారు. లారీ డ్రైవర్ తాహిర్, ఓనర్ ఎండీ.నజీమ్, నాగ్ నాథ్,  షఫీ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.